షాహిద్ అంటే నాకు చాలా ఇష్టం | Sakshi
Sakshi News home page

షాహిద్ అంటే నాకు చాలా ఇష్టం

Published Mon, Dec 16 2013 3:12 AM

i like shahid kapoor : ileana

 కాలు జారితే కష్టం అంటున్నారు ఇలియానా. దీనికి చాలామంది రకరకాల అర్థాలు తీసే అవకాశం ఉంది. కానీ, ఇలియానా చెబుతున్నది తడిగా ఉన్న గచ్చు గురించి. ఇటీవల ఓ అమ్మాయి ఇలియానా కళ్ల ముందే జర్రున జారిపడింది. దాంతో ఈ గోవా సుందరి కంగారు పడిపోయి, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, చెయ్యిపట్టుకుని పైకి లేపారట. ఆ అమ్మాయికి  దెబ్బలేవీ తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారామె. ఈ సందర్భంగానే తడి గచ్చు చాలా ప్రమాదం సుమా అన్నారు ఇలియానా. ఇదిలా ఉంటే.. ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లో వైభవంగా కెరీర్ ప్రారంభించిన ఇలియానాకు మలి చిత్రం ‘ఫటా పోస్టర్ నిఖ్‌లా’ పరాజయం చేదు అనుభవాన్ని మిగిల్చింది. 
 
 పైగా, ఈ  చిత్రకథానాయకుడు షాహిద్‌కపూర్‌తో ఇలియానాకు మాటామంతీ లేవనే టాక్ కూడా ప్రచారంలో ఉంది. దీని గురించి ఇలియానాని ప్రశ్నిస్తే -‘‘జయాపజయాలనేవి కామన్. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక, షాహిద్ గురించి చెప్పాలంటే.. తనతో నాకెలాంటి వైరం లేదు. మేమిద్దరం శుభ్రంగా మాట్లాడుకుంటున్నాం. తనకూ నాకూ మధ్య ఏవో గొడవలున్నాయని ఎవరు సృష్టిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. షాహిద్ అంటే నాకు చాలా ఇష్టం. తను కూడా నాతో ఇష్టంగా మాట్లాడతాడు. కాబట్టి, మా మధ్య గొడవలున్నాయనే వార్తకు ఫుల్‌స్టాప్ పెట్టడం మంచిది’’ అన్నారు.
 

Advertisement
Advertisement