నువ్వు అహంకారి అన్నారు | Sakshi
Sakshi News home page

నువ్వు అహంకారి అన్నారు

Published Sun, Apr 29 2018 1:54 AM

I was called ‘ahangari’ for asking to see scripts - Sakshi

తన ఒపీనియన్‌ వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనకాడరు మలయాళీ బ్యూటీ ‘పార్వతి’. ‘‘కేవలం యాక్టర్‌ అయ్యాక వచ్చిన యాటిట్యూడ్‌ కాదిది. చిన్నప్పటినుంచి నాకు అనిపించింది చెప్పడం అలవాటు. నా ముక్కుసూటితనం వల్ల ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను’’ అంటున్నారామె. చిన్నప్పటి నుంచి ప్రశ్నించే స్వభావం గురించి పార్వతి మాట్లాడుతూ– ‘‘ఇలా ప్రశ్నలు వేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఈ క్వొశ్చనింగ్‌ నేచర్‌ చిన్నప్పటి నుంచి నాతో ఉండిపోయింది. అబ్బాయిలే చెట్లెందుకు ఎక్కాలి? అమ్మాయిలెందుకు ఎక్కకూడదు? అని అడిగేదాన్ని. 

అందరి శరీరాకృతి ఒక్కటే కదా? అందరూ సమానమే కదా. అమ్మాయిలు చెట్లు ఎక్కలేక కాదు. అమ్మాయిల్ని అలా చేయనీకూడదు అని వీళ్లు (సొసైటీ) అనుకున్నారంతే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే  కెరీర్‌ బిగినింగ్‌లో ‘నేను స్క్రిప్ట్‌  చూడాలి’ అని, ‘ఇంత రెమ్యునరేషన్‌ కావాలి’ అని అడిగాను. అంతే.. అప్పటి నుంచి నన్ను  ‘అహంకారి’ అనేవారు. కానీ, ట్రూ ఆర్టిస్ట్‌ని, ఆర్ట్‌ని ఎవ్వరూ ఆపలేరు కదా?’’ అని పేర్కొన్నారామె. రీసెంట్‌గా ‘టేక్‌ఆఫ్‌’ సినిమాకు పార్వతి బెస్ట్‌ యాక్ట్రెస్‌గా జాతీయ అవార్డ్‌ అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement