హేపీ ఉమెన్స్ డే చెప్పను: వర్మ | Sakshi
Sakshi News home page

హేపీ ఉమెన్స్ డే చెప్పను: వర్మ

Published Tue, Mar 8 2016 8:26 AM

I will not wish happy womens day, says ramgopal varma

మహిళా దినోత్సవం సందర్భంగా తాను మహిళలకు హేపీ ఉమెన్స్ డే విషెస్ మాత్రం చెప్పబోనని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. అయితే.. మహిళలు ఏడాదిలో అన్నిరోజులూ సంతోషంగా ఉండాలనే తాను నమ్ముతానని, కేవలం వాళ్ల కోసం కేటాయించిన ఒక్క రోజు మాత్రమే కాక, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాను నమ్ముతానని చెప్పారు.

దేవుడి సృష్టిలో మహిళలు అత్యంత అందమైన వాళ్లని చెబుతూనే... ఇదే సృష్టిలో ఉగ్రవాదులు, బొద్దింకల లాంటి అత్యంత ఘోరమైన విషయాలు సృష్టించినా కూడా అతడిని తాను క్షమించేస్తానని వర్మ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయమే ఆయన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
Advertisement