‘జేమ్స్‌ బాండ్‌ 25’ మరోసారి వాయిదా! | Sakshi
Sakshi News home page

‘జేమ్స్‌ బాండ్‌ 25’ మరోసారి వాయిదా!

Published Wed, Feb 20 2019 11:34 AM

James Bond 25 Release Date Has Been Pushed Back Again - Sakshi

వెండితెర మీద బాండ్‌ చేసే సాహసాలను ఇష్టపడని సినీ ప్రేక్షకుడు ఉండడు. జేమ్స్‌ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఈ సిరీస్‌లో ఇప్పటికే 24 సినిమాలు విడుదలై సంచలనాలు నమోదు చేశాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రాజెక్ట్ మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది.

ముందుగా బాండ్‌ పాత్రలో నటించేందుకు డేనియల్‌ క్రేగ్‌ అంగీకరించలేదు. భారీ పారితోషికం ఆఫర్‌ చేసి మరీ అతన్ని ఒప్పించాల్సి వచ్చింది. తరువాత చిత్ర దర్శకుడు డేని బాయ్‌లే తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడిని లైన్‌లోకి తీసుకువచ్చారు. క్యారీ జోజి దర్శకత్వంలో జేమ్స్‌బాండ్‌ 25 త్వరలో పట్టాలెక్కనుంది. ముందుగా ఈ సినిమాను 2019 నవంబర్‌ లేదా 2020 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ.. చిత్రీ కరణ ఆలస్యం కావటంతో 2020 ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

Advertisement
Advertisement