'ఏ' సర్టిఫికెట్‌తో వస్తున్న జయిక్కిర కుదిర

7 Oct, 2017 10:37 IST|Sakshi

సాక్షి, చెన్నై: లవ్, కామెడీ, గ్లామర్‌ ఈ మూడు అంశాలు ఉంటేనే నేటి యువతకు చిత్రాలు నచ్చుతున్నాయి. అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం జయిక్కిర కుదిరై అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శక్తి ఎన్.చిదంబరం. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సినిమాప్యారడైజ్, చరణ్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కొంత గ్యాప్‌ తరువాత జీవన్ హీరోగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా డింపుల్‌ శోబాడే, సాక్షీఅగర్వాల్,  అశ్వని ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, తలైవాసల్‌ విజయ్, కోవైసరళ, రవిమరియ, సింగంపులి, చిత్రాలక్ష్మణ్, లీవింగ్‌స్టన్, రమేశ్‌ఖన్నా, మదన్ బాబు, యోగిబాబు, భడవాగోపి, టీపీ.గజేంద్రన్, పాండు, ఏఎల్‌.అళగప్పన్, రోబోశంకర్, ఇమాన్ అన్నాచ్చి, దీప, రామానుజం, వైయాపురి, ఆదవన్ నటిస్తున్నారు.

అంజి సంగీతం, కేఆర్‌.కవిన్ శివ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు శక్తి.ఎన్.చిదంబరం తెలుపుతూ జయిక్కిర కుదిరై చిత్రం జనరంజకమైన అంశాలతో ఆరంభం నుంచి, చివరి వరకూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు