అభయ్@ఎన్టీఆర్‌ 28! | Sakshi
Sakshi News home page

అభయ్@ఎన్టీఆర్‌ 28!

Published Tue, Oct 24 2017 12:02 AM

Jr NTR 28th Movie | Pawan Kalyan Attends Jr NTR's Film Launch ... - Sakshi

ఎన్టీఆర్‌ తనయుడు మూడేళ్ల అభయ్‌రామ్‌ నిన్న సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌. అందరి చూపూ ఈ బుడతడి పైనే! త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముద్దు ముద్దు మాటలు, బుడి బుడి అడుగులతో అభయ్‌ ఈ వేడుకలో సందడి చేశాడు. అయితే... అభయ్‌ గురించి ఇంకో వార్త సందడి చేస్తోంది. అదేంటంటే? అభయ్‌ కోసం సినిమాలో చిన్న అతిథి పాత్ర ప్లాన్‌ చేశారట త్రివిక్రమ్‌! ఇదెంతవరకూ నిజమో త్వరలో తెలుస్తుంది.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై ప్రొడక్షన్‌ నంబర్‌ 5గా ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. హీరోగా ఎన్టీఆర్‌కి ఇది 28వ సినిమా. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్, చినబాబులు త్రివిక్రమ్‌కి స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన  పవన్‌ కల్యాణ్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు అనిరు«ద్‌ రవిచంద్రన్, నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement