రికార్డు స్థాయిలో రూ. 148 కోట్ల కలెక్షన్లు | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో రూ. 148 కోట్ల కలెక్షన్లు

Published Wed, Apr 27 2016 11:08 AM

రికార్డు స్థాయిలో రూ. 148 కోట్ల కలెక్షన్లు

ముంబయి: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఏప్రిల్ 8న దేశంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 148 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.

ఈ సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.  ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 

Advertisement
Advertisement