Sakshi News home page

నేను మళ్లీ నటిస్తానని అనుకోలేదు

Published Sat, May 16 2015 2:58 AM

నేను మళ్లీ నటిస్తానని అనుకోలేదు - Sakshi

నటి జ్యోతిక నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవరసాలే మెచ్చే విధంగా నటించగల దిట్ట ఆమె. మచ్చుకు ఒక చంద్రముఖి చిత్రం చాలు నటిగా జ్యోతిక ఏమిటన్న దానికి సహజంగా వయో భేదం అనేది హీరోల కంటే హీరోయిన్లపైనే అధిక ప్రభావం చూపుతుంది. పెళ్లి, పిల్లలు, సంసార జీవితం ఇందుకు  ఒక కారణం కావచ్చు. అయితే నటుడు సూర్యతో ప్రేమ, పెళ్లి, ఇద్దరు పిల్లలు ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవిస్తూ సుమారు ఎనిమిదేళ్ల తరువాత...

మళ్లీ నటనను ఆహ్వానించి ముఖానికి రంగేసుకుని 36 వయదినిలే అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భామ అనుభవాలను తెలుసుకుందాం.

 
పశ్న: సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ కెమెరాముందు నిలబడినప్పుడు ఎలా అనిపించింది?
జ:
నిజం చెప్పాలంటే తొలిరోజు షూటింగ్‌కు భయం భయంగానే వెళ్లాను. నా పరిస్థితిని గమనించిన దర్శకుడు రోషన్ ఆండ్య్రూస్ చాలా సహకరించారు.
 
ప్రశ్న: ఇంతకుముందు ఒకటి రెండు చిత్రాలు మినహా మీరు చేసినవన్ని చలాకీ పాత్రలే. అలాం టిది ఈ 36 వయదినిలేలో చాలా పరిణితి చెందిన పాత్ర. ఈ విషయంపై మీ స్పందన?
జ:
17-18 ఏళ్లకే నేను సినిమా రంగ ప్రవేశం చేశాను. అప్పట్లో తమిళ భాష తెలియదు. ఐదేళ్లు కష్టపడి భాష నేర్చుకున్నాను. కొన్ని చిత్రాల్లో ఓవ ర్ యాక్టింగ్ అని సందర్భాలు ఉన్నాయి. నేను చివరిగా నటించిన మొళి చిత్రం అప్పుడు నా వయసు 27. సన్నివేశం ఏమిటి? సంభాషణలు అర్థం ఏమిటి? అన్నవి తెలుసుకుని నటిస్తే ఓవర్ యాక్షన్ తగ్గుతుంది. ప్రస్తు తం నా వయసు 36. వయసుకు తగ్గ పాత్రను 36 వయదినిలే చిత్రంలో చేయగలగడం గొప్పగా భావిస్తున్నాను.
 
ప్రశ్న: మీ నిత్య దిన చర్య గురించి?
జ:
ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తాను. ఏడు గంటల కల్లా పిల్లలు పాఠశాలకు వెళతారు. వారు లేకపోతే నాకు ఇంటిలో ఉండలేను. ఎనిమిదిన్నరకు జిమ్‌కు వెళతాను. తిరిగి 12 గంటలకు ఇంటికి వెళతాను. ఆ సమయానికి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. 12 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పిల్లలతో సరిపోతుంది. ఇక సూర్య ఇంటిలో ఉంటే ఆయనతో మాట్లాడుతూ భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. సూర్య లేకపోతే రాత్రి 10.30 గంటల సినిమా చూడటానికి థియేటర్‌కు వెళతా. మధ్యమధ్యలో ఇంటికి ఫోన్ చేసి పిల్లలు నిద్రపోతున్నారా? లేక అల్లరి చేస్తున్నారా? అని తెలుసుకుంటాను. ఇదే నా దినచర్య.
 
ప్రశ్న: మీ నటనకు విమర్శకులు ఎవరు?
జ:
స్నేహితురాళ్లే. సూర్య నా నటనను విమర్శించరు. చాలా ఓవర్‌గా నటించినా సూపర్ అంటారు. సుమారుగా నటించిన చాలా పరిణితి చెందిన నటన అంటారు.
 
ప్రశ్న: పిల్లల స్వభావం గురించి?
జ:
మా అమ్మాయి రియాది కొంచెం మొహమాటం ఎక్కువ. సూర్య మాది రిగానే చాలా తక్కువగా మాట్లాడుతుంది. మా అబ్బాయి దేవ్ అచ్చం నాలాగే. గలగలా మాట్లాడుతాడు. అమ్మాయి వెజిటేరియన్. అబ్బాయి నాన్ వెజ్. ఇద్దరు స్విమ్మింగ్, జిమ్, క్రీడలు, కరాటే అంటే యమ బిజీ.
 
ప్రశ్న: మీకు నచ్చని విషయాలంటూ ఏమైనా ఉన్నాయా?
జ:
సమయాన్ని వృథా చేయడం అసలు నచ్చదు. సూర్య ఇంటిలో ఉంటే రోజంతా స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటారు. అలాంటప్పుడే నాకు కోపం వస్తుంది. అందుకే ఇంటికి వచ్చి కాలింగ్‌బెల్ కొట్టినపుపడు నేను వచ్చి తలుపు తీసినప్పుడు తను ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటిలోకి రాకూడదని చట్టం వేశాను.
 
ప్రశ్న: ఇకపై వరుసగా నటిస్తారా?
జ:
నేను మళ్లీ నటిస్తానని అనుకోలేదు. 36 వయదునిలే చిత్రంలో నటించడమే అనూహ్యంగా జరిగిపోయింది. మంచి కథా పాత్ర లభిస్తే ఇకపై కూడా నటిస్తా.

Advertisement
Advertisement