‘కబాలి-2’ వస్తాడా? | Sakshi
Sakshi News home page

‘కబాలి-2’ వస్తాడా?

Published Tue, Nov 15 2016 12:18 AM

‘కబాలి-2’ వస్తాడా?

కళ్లలో కసి.. సూట్‌లో స్టైల్.. నిప్పులాంటి నడక.. ముత్యంలా మెరిసే నవ్వు.. తెల్లగడ్డం.. వయసైన గ్యాంగ్‌స్టర్‌గా ‘కబాలి’లో రజనీకాంత్‌ను చూసిన అభిమానులు ‘స్టైల్ స్టైల్ రా.. నీది సూపర్ స్టైల్ రా’ అని ‘బాషా’లో పాటేసుకున్నారు. ‘బాషా’ విడుదలైన ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన సినిమా ‘కబాలి’. పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్.థాను నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్‌ను చూపించిన తీరు ఆయన వీరాభిమానులకు తెగ నచ్చింది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీయడానికి ‘కలైపులి’ ఎస్.థాను రెడీ అంటున్నారు. ఇటీవలే ఫిల్మ్ చాంబర్‌లో ‘కబాలి-2’ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే.. ఇక్కడో మెలిక ఉంది. రజనీకాంత్ ఇంకా ఈ సీక్వెల్‌ను ఓకే చేయలేదట. గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ‘కబాలి-2’ ముందుకు వెళ్తుందట. అల్రెడీ పా. రంజిత్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి రజనీకాంత్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్నారు.

Advertisement
Advertisement