Sakshi News home page

కాజల్కు బాధ లేదట..!

Published Sun, Jun 5 2016 12:13 PM

కాజల్కు బాధ లేదట..! - Sakshi

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. కెరీర్ ఇక ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో రెండు భారీ చిత్రాల్లో అవకాశం వచ్చినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన సర్థార్ గబ్బర్సింగ్, బ్రహ్మోతవ్సం సినిమాలు అభిమానులను నిరాశపరచటంతో టాలీవుడ్ కాజల్ కెరీర్ మరోసారి ఇబ్బందుల్లో పడింది.

అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్ తనకు బాధ కలిగించలేదని చెపుతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం తన బాలీవుడ్ సినిమా దో లఫ్జోంకీ కహాని ప్రమోషన్లో బిజీగా ఉన్న కాజల్, సర్థార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల గురించి మీడియాతో మాట్లాడింది. ఆ రెండు సినిమాలు నేను ఇష్టంగా చేశాను.

పవన్ లాంటి స్టార్ హీరో సరసన తొలి సారిగా నటించటం ఆనందంగా ఉంది. బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాల్లో అవకాశం రావటం అరుదు. అందుకే ఆ సినిమాల్లో నటించటం ఆనందంగా ఉంది.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ నక్షత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది.

Advertisement
Advertisement