కలలను వెంటాడండి! | Sakshi
Sakshi News home page

కలలను వెంటాడండి!

Published Fri, Feb 2 2018 12:17 AM

Kajal Agarwal revealed her real success - Sakshi

‘‘ప్రతి ఒక్కరికి డ్రీమ్స్‌ ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవటానికి కష్టపడుతూ ఉండాలి. చిన్నప్పుడు నేను యాక్టర్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. నా కలను నెరవేర్చుకోవడానికి కష్టపడ్డాను. ఇవాళ యాక్టర్‌గా నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను’’ అన్నారు నటి కాజల్‌. అది మాత్రమే కాదు.. కలను సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్పారు.

► జీవితంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో అర్థం కాని అయోమమ పరిస్థితుల్లో పడిపోవచ్చు. అలాంటి టైమ్‌లో అస్సలు నిరాశ చెందకండి. అలాంటి సిచ్యువేషన్స్‌ను  అధిగమించగలిగితేనే సక్సెస్‌ సాధించగలం.

► కొన్నిసార్లు మేం బాగా యాక్ట్‌ చేయవచ్చు. అయినా రిజల్ట్‌ మా చేతుల్లో ఉండదు.  గెలుపు ఓటములు మన చేతుల్లో ఉండవు. కానీ ఏది వచ్చినా కూడా ఒకేలా తీసుకుని ముందుకు వెళ్లగలగాలి. చేసే పనిలో మనం బెస్ట్‌ ఇవ్వాలి. రిజల్ట్‌ ఫేట్‌ డిసైడ్‌ చేస్తుంది.

► మనం అనుకున్న గోల్‌ రీచ్‌ కావడానికి చాలా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లోన్లీగా అనిపించొచ్చు. ఎవరూ మనకు లేరని కాదు. మనం తీసుకున్న నిర్ణయాలతో వారు మనతో ఏకీభవించకపోవచ్చు. వాళ్లు కోరుకునేది మన మంచికే అవ్వచ్చు. కానీ మీరు తీసుకున్న డెసిషన్‌ మీద మీరు నిలబడగలగాలి.

► మనం ఏది అచీవ్‌ చేయాలనుకున్నా కావాల్సినవాళ్ల సహకారం లేనిదే మనం ఏమీ చేయలేము. సో.. ఎప్పటికీ అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

► అందరికీ ఇన్‌ సెక్యూరిటీస్‌ ఉంటాయి. అందరం అందరిలా ఉండకపోవచ్చు. మనం  ఎవరితో అయినా కంపేర్‌ చేయదలుచుకుంటే అది నిన్నటి మనతోనే. ఒకవేళ మీరు ఏదైనా ఇంప్రూవ్‌ చేసుకోవాలనుకుంటే అది కేవలం మీ గ్రోత్‌కు ఉపయోగపడితేనే చేయండి.

► ఇవే కాకుండా ప్రస్తుతం ముఖ్యంగా నోట్‌ చేసుకోవాల్సింది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం.

Advertisement

తప్పక చదవండి

Advertisement