డేట్‌కి రెడీ! అంటోన్న కాజల్‌ | Sakshi
Sakshi News home page

డేట్‌కి రెడీ!

Published Sat, Oct 21 2017 11:32 PM

Kajal Aggarwal Open Statement About Dating With A Fan  - Sakshi

డేటింగ్‌కి రెడీ అంటున్నారు హీరోయిన్‌ కాజల్‌. ఊహల్లో తేలి డ్రీమ్‌ సాంగ్‌ వేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ఎందుకంటే ఎవరితో పడితే వాళ్లతో ఆమె డేటింగ్‌కి రెడీ అనడం లేదు. ఫ్యాన్స్‌కి మాత్రమే ఆమె ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. కానీ, ఈ ఆఫర్‌ దక్కాలంటే అంత ఈజీ కాదు. ఈ బ్యూటీ పెట్టిన కండిషన్స్‌ అలా ఉన్నాయి మరి. అవేంటో తెలిస్తే ఊహల్లో నుంచి ఢామ్మని కిందకు పడతారంతే.

ఇంతకీ ఆ కండిషన్స్‌ ఏంటంటే... ఏ ఫ్యాన్‌తో డేట్‌కి వెళ్లేది తన ఇష్టమేనట. ఫ్లేస్‌ అండ్‌ టైమ్‌ కూడా తనే నిర్ణయిస్తారట. అక్కడితో ఆగలేదండి బాబు! డేటింగ్‌ డ్యూరేషన్‌ టైమ్‌ కూడా కాజలే చెబుతారట. ఇంకేముంది? ఇది జరిగే ఎవ్వారం కాదని, కాజల్‌ ఊరించి ఉసూరుమనిపించిందని ఫ్యాన్స్‌ అంతా డీలా పడిపోయారు పాపం. డేటింగ్‌ గురించి పక్కన పెడదాం. తన వివాహం గురించి కాజల్‌ మాట్లాడుతూ – ‘‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటామనేది ముఖ్యం కాదు. ఎవర్ని చేసుకుంటామనేదే ఇంపార్టెంట్‌’’ అన్నారు.

Advertisement
Advertisement