చిరుతో చిందేసేది చందమామే..! | Sakshi
Sakshi News home page

చిరుతో చిందేసేది చందమామే..!

Published Sat, Jul 30 2016 12:06 PM

చిరుతో చిందేసేది చందమామే..!

ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యిందన్న వార్త వినిపిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్నా ఇంత వరకు ఈ సినిమాకు హీరోయిన్ను ఫిక్స్ చేయలేదు. కొంత మంది బాలీవుడ్ భామలతో పాటు పలువురు సౌత్ హీరోయిన్స్ను సంప్రదించినా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఫైనల్గా చందమామ కాజల్ అగర్వాల్నే హీరోయిన్గా ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపించింది.

గతంలోనే కాజల్ పేరు వినిపించినా అప్పట్లో ఈ బ్యూటి ఆ వార్తలను ఖండించింది. అయితే తాజాగా ఓ తమిళ మీడియా సంస్థతో.. కాజల్, తాను చిరుతో కలిసి నటిస్తున్నానని వెల్లడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రామ్ చరణ్, నాకు అత్యంత సన్నిహితుడని తన నిర్మాణంలో సినిమా అంటే రెమ్యూరేషన్ విషయంలో కూడా బెట్టు చేయనని తేల్చేసిందట. మరి ఇప్పటికైన మెగా టీం, కాజల్ పేరు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Advertisement
Advertisement