ఆయన చాలా సిన్సియర్, మరి విజయ్‌?

11 Aug, 2017 01:42 IST|Sakshi
ఆయన చాలా సిన్సియర్, మరి విజయ్‌?

తమిళసినిమా: నటుడు అజిత్‌ చాలా సిన్సియర్‌ అంటున్న నటి కాజల్‌అగర్వాల్‌తో మరి విజయ్‌ మాటేమిటన్న ప్రశ్నకు ఏం బదులిచ్చారో చూద్దాం. నేటి క్రేజీ హీరోయిన్లలో కాజల్‌అగర్వాల్‌ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో ఇద్దరు ప్రముఖ హీరోలతో ఏకకాలంలో నటిస్తున్న లక్కీ నటి ఈ బ్యూటీ. అంతే కాదు ఈ నెలలో ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నాయి.

అందులో ఒకటి అజిత్‌తో రొమాన్స్‌ చేసిన వివేగం ఇకటి కాగా టాలీవుడ్‌ యువ నటుడు రానాతో నటించిన నేనేరాజా నేనే మంత్రి మరొకటి. వీటితో పాటు ఇళయదళపతి విజయ్‌ సరసన నటిస్తున్న మెర్శల్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో యమ ఖుషిలో ఉన్న కాజల్‌ను పలకరించగా ఈ ఏడాది తన టైమ్‌ చాలా బాగుందని ఖుషీ అయ్యారు. కోలీవుడ్‌లో అజిత్, విజయ్‌తో ఏక కాలంలో నటించారు.

ఎలా భావిస్తున్నారన్న ప్రశ్నకు చాలా సంతోషంగా ఉందని, అజిత్‌తో తొలిసారిగా నటించానని అన్నారు. ఆయన నటనలో చాలా సిన్సియర్‌ అని అంతకు మించి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడని పేర్కొన్నారు. అజిత్‌ లాంటి ఫ్యాబులస్‌ యాక్టర్‌తో కలిసి నటించడం తీయని అనుభవం అని అన్నారు. వివేకం చిత్ర ఒన్‌లైన్‌ స్టోరీని దర్శకుడు చెప్పగానే తాను ఫ్లాట్‌ అయ్యిపోయానని పేర్కొన్నారు. ఇందులో తానింతవరకూ నటించనటువంటి పాత్రను పోషించానని చెప్పారు.

వివేగం చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. అనిరుధ్‌ చాలా మంచి సంగీతాన్నిచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఆశ పడుతున్నానంటున్న కాజల్‌తో నటుడు విజయ్‌ మాట ఏమిటన్న ప్రశ్నకు ఆయనతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించానని, విజయ్‌ గురించి చెప్పాలంటే ముందు ఆయన ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలని అన్నారు. చాలా లవబుల్‌ పర్సన్‌. అంతకు మించి హార్డ్‌వర్కర్‌ అని పేర్కొన్నారు. విజయ్‌ స్టైలిష్‌ నటనను చూసిన తాను చాలా ఎడ్మైర్‌ అయ్యానని కాజల్‌ అంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి