చిరంజీవికి షాక్ ఇచ్చిన కాజల్..? | Sakshi
Sakshi News home page

చిరంజీవికి షాక్ ఇచ్చిన కాజల్..?

Published Thu, Jul 21 2016 1:47 PM

చిరంజీవికి షాక్ ఇచ్చిన కాజల్..? - Sakshi

చాలా ఏళ్లుగా ఊరిస్తున్న మెగాస్టార్ 150వ సినిమా ఇటీవల పట్టాలెక్కిన విషయం తెలిసింది. భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్కు సంబందించిన వార్త ఒకటి మెగా అభిమానులకు షాక్ ఇస్తోంది.

మెగా హీరో రామ్ చరణ్తో నాలుగు సినిమాలు చేసిన కాజల్ను, చిరు సినిమాకు హీరోయిన్గా అడిగారట. అయితే అందుకు అంగీకరించిన కాజల్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఏ భాషలోనూ ఫాంలో లేని కాజల్కు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకోవటం అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు చిరు 150 టీం.

Advertisement

తప్పక చదవండి

Advertisement