‘సల్మాన్‌ సినిమా అయితే రూ. 500 కోట్లు..’

22 Sep, 2018 17:46 IST|Sakshi

ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో కాజోల్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హెలికాప్టర్‌ ఈల’. ఈ సినిమాలో కొడుకు చదువుకునే కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసే మదర్‌ క్యారెక్టర్‌లో కాజోల్‌ కన్పించనున్నారు. ప్రస్తుతం హెలికాప్టర్‌ ఈల ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన కాజోల్‌.. హీరో- హీరోయిన్‌ల పారితోషికాల వ్యత్యాసం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్‌ ఖాన్‌ సినిమాలా కాదు..
‘సినిమా ద్వారా జరిగే బిజినెస్‌ మీదే పారితోషికాలు ఆధారపడి ఉంటాయని నేను నమ్ముతాను. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలా.. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు 500 కోట్ల రూపాయల వసూలు చేసిన దాఖలాలు లేవు. చాలా ఏళ్లుగా హీరోయిన్‌లు సినిమా విజయంలో ముఖ్య భాగంగా ఉంటున్నారే తప్ప.. వారే విజయానికి కారణమైన తార్కాణాలు తక్కువనే చెప్పాలి. అందుకే పారితోషికాల విషయంలో వ్యత్యాసం ఉంటుందనుకుంటున్నా. కానీ కహానీ, రాజీ వంటి సినిమాలు వీటన్నింటినీ తప్పని నిరూపించాయి. ఇందుకు కారణం ప్రేక్షకులే. వారి ఆశీర్వాదాలే ఉంటే గనుక ఏ సినిమా అయినా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. హీరోయిన్‌ సెంట్రిక్‌ సినిమాలను వారు ఆదరిస్తున్నారు. ఇది మంచి పరిణామం’ అంటూ కాజోల్‌ వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు