ఆయనకు పెద్ద ఫ్యాన్ ని- కవిత | Sakshi
Sakshi News home page

ఆయనకు పెద్ద ఫ్యాన్ ని- కవిత

Published Tue, Mar 15 2016 3:44 PM

ఆయనకు పెద్ద ఫ్యాన్ ని- కవిత - Sakshi

'మెగాస్టార్ చిరంజీవికి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ని, ఆయన ఏ సినిమాను మిస్ అయ్యేదాన్ని కాదు.. ప్రస్తుతం ఆయన 150వ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను' అన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ హీరోలలో చిరంజీవికి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని,  చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఠాగూర్ సినిమాలంటే మహా ఇష్టం అని తెలిపారు.

కానీ చిరంజీవి రాజకీయ జీవితానికి సంబంధించిన వైఖరి మాత్రం తనను పూర్తిగా నిరాశపరిచిందని కవిత చెప్పారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద అభిప్రాయం చెప్పమని అడుగ్గా.. అటు సినిమాల పరంగాను, ఇటు రాజకీయాల పరంగాను నేనెప్పుడూ పవన్ కల్యాణ్ కు కనెక్ట్ అవ్వలేదు అంటూ సమాధానమిచ్చారు కల్వకుంట్ల కవిత.

Advertisement
Advertisement