నటి కొడుకుపై దాడి

30 May, 2020 10:20 IST|Sakshi
విక్కీ

సినిమా: శృంగార నటి మాయ కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక వడపళనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు. కాగా నుంగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు పాత కక్ష్యల కారణంగా దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు