మీడియాకు కొరటాల శివ రిక్వెస్ట్ | Sakshi
Sakshi News home page

మీడియాకు కొరటాల శివ రిక్వెస్ట్

Published Fri, Oct 6 2017 1:37 PM

Koratala Siva - Sakshi

వరుసగా ఘనవిజయాలు సాధిస్తున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే కొరటాల శివ సినిమాను ప్రారంభించిన మహేష్, శర వేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటో సినిమా నేపథ్యం రివీల్ అయ్యేలా ఉండటంతో చిత్ర దర్శకుడు కొరటాల శివ వెంటనే స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా.. లీక్ అయిన ఫొటోలు మీడియాలో ప్రసారం చేయవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement