‘హలో బ్రదర్’ని తలపించేలా... | Sakshi
Sakshi News home page

‘హలో బ్రదర్’ని తలపించేలా...

Published Fri, Apr 11 2014 2:40 AM

‘హలో బ్రదర్’ని తలపించేలా... - Sakshi

వారసత్వంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోడానికి ఓ కుర్రాడు ఎన్ని పాట్లు పడ్డాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న హాస్యభరిత చిత్రం ‘జంప్ జిలాని’. అల్లరి నరేశ్ తొలిసారి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. అంబికా రాజా నిర్మాత. ఇషా చావ్లా, సాక్షి దీక్షిత్ కథానాయికలు.
 
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘‘హలో బ్రదర్’లో నాగార్జునగారి ద్విపాత్రాభినయాన్ని తలపించేలా ఇందులో అల్లరి నరేశ్ పాత్రలు సాగుతాయి. ఇందులో ఇషా చావ్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘తమిళ చిత్రం ‘కలగలప్పు’కు ఈ చిత్రం రీమేక్. రెండు పాత్రల్లో నరేశ్ కావల్సినంత వినోదాన్ని పంచుతారు.
 
ఇందులోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకాక్, పుకెట్‌లలో నరేశ్, ఇషా, సాక్షి దీక్షిత్‌లతో పాటల్ని తీస్తున్నాం. ఓ వైపు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోంది’’ అని నిర్మాత చెప్పారు. విజయ్ ఎబెంజర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని సమర్పకుడు అంబికా కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అంబికా కృష్ణ బ్రదర్స్.

Advertisement

తప్పక చదవండి

Advertisement