‘‘మళ్ళీ రావా’ రొమాంటిక్ లవ్ స్టోరీ. కార్తీక్, అంజలి మధ్య సాగే ప్రేమకథ. 20 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల వల్ల విడిపోయిన వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అన్నది కథ’’ అని హీరో సుమంత్ అన్నారు. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన ‘మళ్ళీ రావా’ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ విలేకరులతో మాట్లాడారు.
► ఈ సినిమాను కథ రూపంలో చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. మూడు దశల్లో సాగే ప్రేమకథ. ఒకటి చిన్నప్పుడు, మరొకటి వర్కింగ్ ప్లేస్‌లో, ఇంకొకటి కాస్త మెచ్యూర్డ్ ఏజ్‌లో సాగుతుంది. ఈ మూడు స్టేజ్‌ల సన్నివేశాలు సమాంతంరగా ఉండేలా గౌతమ్ ప్రెజెంట్ చేశాడు. గతంలో ‘నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్’ వంటి సినిమాలొచ్చినా ‘మళ్ళీ రావా’ కథనం కొత్తగా ఉంటుంది.
► నేను గతంలో ‘గోదావరి, మధుమాసం’ వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించినా, వాటికి భిన్నంగా సాగే చిత్రమిది. ఇదొక సహజమైన ప్రేమకథ. పాటలన్నీ కథలో భాగంగా వస్తుంటాయి.
∙గౌతమ్ చెప్పిన రెండు గంటల కథ వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. తను చేయాలనుకున్న సన్నివేశాలను వేరే నటీనటులతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చేసి చూపించాడు. తన ప్లానింగ్ నచ్చడంతోనే సినిమా చేస్తానన్నా.
► నిర్మాత రాహుల్ మేకింగ్‌లో పాటించిన ప్లానింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఓ నటుడిగానే నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యా. దర్శక–నిర్మాతలు చక్కగా ప్లాన్ చేయడం వల్ల సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌కు పది నెలల సమయం పట్టింది.
► నేను డబ్బు కోసమే సినిమాలు చేయను. అందుకు మా తాతగారు (నాగేశ్వర రావు), కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. నేను సంపాదించిన డబ్బు కూడా చక్కగా ఇన్వెస్ట్ చేశా. నా సంతృప్తి కోసం పని చేస్తున్నా. గత 17 ఏళ్లలో నేను చేసింది 22 సినిమాలే. గతంలో వరుసగా సినిమాలు చేశా. ఇప్పుడు నాకు ఆ తొందర లేదు. సహజమైన కథలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా.
► ‘మళ్ళీ రావా’ తర్వాత రెండు సినిమాలు చేయబోతున్నా. వాటిలో ఒకటి డార్క్ థ్రిల్లర్. మరో సినిమా వివరాలను త్వరలోనే చెబుతా.
డబ్బు కోసం పని చేయను
Published Fri, Dec 8 2017 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement