Sakshi News home page

బాబు బంగారం కొత్త కథే..!

Published Sun, Jul 3 2016 2:19 PM

బాబు బంగారం కొత్త కథే..!

భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, తొలిసారిగా ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా బాబు బంగారం. వెంకటేష్ నయనతార జంటగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్ను పూర్తి చేసి ఈ నెల 29న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గతంలో వెంకటేష్, నయనతారల కాంబినేషన్లో మారుతి దర్శకత్వంలో రాధ అనే సినిమా ప్రారంభమై.. ఆగిపోయింది. అయితే అదే కథను కొద్ది పాటి మార్పులతో బాబు బంగారంగా తెరకెక్కిస్తున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపించింది. ఈ వార్తలను ఖండించిన మారుతి, రాధ కథతో బాబు బంగారానికి అసలు సంబందం లేదని, ఇది పూర్తిగా కొత్త కథ అని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement