సినీ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం..

1 May, 2019 12:12 IST|Sakshi

ప్రముఖ సినీ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్‌ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ధర్మా ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు బూడిదైనట్టుగా తెలుస్తోంది.

ఎక్కువగా కాస్ట్యూమ్స్‌, సినిమా సెట్టింగ్‌లకు వినియోగించే వస్తువులు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని భావిస్తున్నారు. 1976లో కరణ్‌ తండ్రి యశ్‌ జోహర్‌ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్‌ కు సంబంధించిన కెమెరాలు, సెట్‌ ప్రాపర్టీస్‌, కాస్ట్యూమ్స్‌, ఇతర విలువైన వస్తువులను ఇక్కడే భద్రపరుస్తుంటారు. ప్రమాదంలో కొన్ని స్క్రిప్ట్‌లు కాలిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ధర్మా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిన స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు గుడ్‌ న్యూస్‌, సూర్యవంశీ, తక్త్‌ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు