మేడ మీద అబ్బాయి | Sakshi
Sakshi News home page

మేడ మీద అబ్బాయి

Published Sun, Jun 11 2017 12:12 AM

మేడ మీద అబ్బాయి

మేడ మీదున్న ఈ అబ్బాయి పేరు ‘అల్లరి’ నరేశ్‌. అక్కణ్ణుంచి చూస్తే ఊళ్లో చాలావరకు కనిపిస్తుంది. కానీ, ఓ అమ్మాయి నిఖిలా విమల్‌ మాత్రం బైనాక్యులర్‌లోంచి చూస్తే తప్ప కనిపించడం లేదు. ఎందుకంటే... తను కొంచెం దూరంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఈ అబ్బాయి, ఆ అమ్మాయి మధ్య ప్రేమకథతో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ మీద అబ్బాయి’. జాహ్నవి ఫిల్మ్స్‌ పతాకంపై జి. ప్రజిత్‌ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఈవీవీ సత్యనారాయణ జయంతి (శనివారం) సందర్భంగా విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ – ‘‘సరికొత్త కథ, కథనాలతో రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. అలాగే, నరేశ్‌ శైలి కామెడీ కూడా ఉంటుంది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. త్వరలో ఆ పాటను చిత్రీకరించి, జూలైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్, తులసి, సుధ, ‘సత్యం’ రాజేశ్, మధునందన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్‌ (‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌), కెమేరా: ఉన్ని ఎస్‌.కుమార్, కళ: రాజీవ్‌ నాయర్, కూర్పు: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.ఎస్‌.కుమార్, సంగీతం: షాన్‌ రెహమాన్, సమర్పణ: శ్రీమతి నీలిమ.

Advertisement
Advertisement