23 ఏళ్ల యువతితో 52 ఏళ్ల నటుడి వివాహం!

21 Apr, 2018 22:20 IST|Sakshi

ముంబయి: 52 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ సోమన్‌ మిలింద్‌ 23 ఏళ్ల అంకిత కోన్వర్‌లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను మిలింద్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవాడు . అయితే ఆ మద్య సోషల్‌ మీడియాలో మిలింద్‌, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్లు కూడా చేశారు. వీటన్నింటికి ఇక ఫులిస్టాప్‌ పెట్టనున్నారు. 

మిలింద్‌ సోమన్‌ తన ప్రేయసి అంకితలు మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ రోజు(శనివారం) ఉదయం వీరు మెహందీ వేడుక ఘనంగా జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో కాబోయే దంపతులు దిగిన ఫొటోలను తమ స్నేహితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మరిన్ని వార్తలు