‘ఈగ’ స్ఫూర్తితో...

17 Dec, 2014 00:12 IST|Sakshi
‘ఈగ’ స్ఫూర్తితో...

రాజమౌళి ‘ఈగ’ సినిమా స్ఫూర్తితో లైవ్ విత్ కంప్యూటర్ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘మనీ ప్లాంట్’. వెంకట్ గోపు దర్శకత్వంలో గణేశ్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువత, రక్తచరిత్ర, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ చిత్రాల్లో నటించిన రుద్రాక్ష్‌ఇందులో కథానాయకుడు. ముహూర్తపు దృశ్యానికి నటుడు కృష్ణుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శక నిర్మాత ‘మధుర’ శ్రీధర్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత రాజ్ కందుకూరి గౌరవ దర్శకత్వం వహించారు. లవ్, కామెడీ కలగలిసిన సైన్స్ ఫిక్షన్ మర్డర్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. జనవరి మూడోవారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హనుమాన్, కెమెరా: ప్రసాద్ జి.కె.