అబ్దుల్ కలామ్ అవార్డు కోసం... | Sakshi
Sakshi News home page

అబ్దుల్ కలామ్ అవార్డు కోసం...

Published Sun, Aug 17 2014 10:53 PM

అబ్దుల్ కలామ్ అవార్డు కోసం...

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ అనాథ బాలుడు అబ్దుల్‌కలాం అవార్డును సొంతం చేసుకోవడానికి ఏ విధంగా కృషి చేశాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న బాలల చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ అనేది ఉపశీర్షిక. విష్ణు, చెర్రీ, రోమీర్, అర్జున్ ఇందులో ప్రధాన పాత్రధారులు. సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ప్రత్యేక పాత్రల్లో కనిపించే ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిగ్రహశక్తితో ఎదుర్కొని, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో పోటీ పడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్బుర పరిచే ప్రతిభ కనబరిచిన ‘ఆదిత్య’ అనే బాలుడి కథ ఇది. రాము, పాపం పసివాడు, రేపటి పౌరులు లాంటి క్లాసిక్‌లను గుర్తు చేసేలా సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 5న గురుపూజా దినోత్సవ కానుకగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement
Advertisement