మ్యూజిక్ స్టార్ బిరుదిచ్చారు | Sakshi
Sakshi News home page

మ్యూజిక్ స్టార్ బిరుదిచ్చారు

Published Fri, Jul 29 2016 2:03 AM

మ్యూజిక్ స్టార్ బిరుదిచ్చారు - Sakshi

కొనుక్కునే బిరుదులు అడుక్కునే బిరుదుల కంటే అభిమానులి చ్చిన బిరుదుల్లోనే ఆనందం, మజా ఉంటుంది. అలాంటి కిక్‌లో ఉన్నా రు యువ సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సంగీత వారసుడన్న విషయం తెలిసిందే. ఇంతకు ముం దు ఐటమ్ సాగ్స్‌కింగ్‌గా పేరొందిన శ్రీకాంత్‌దేవా ఇప్పుడు ఆల్‌రౌండర్ గా అభినందనలు అందుకుంటున్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అం దించిన తాజా చిత్రం తిరునాళ్. జీవా, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని కోదండపాణి ఫిలింస్ పతాకంపై ఎం.సెంథిల్‌కుమార్ ని ర్మించారు. పీఎస్.రామ్‌నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఐదో తేదీన తెరపైకి రానుంది.ఈ సందర్భంగా తిరునాళ్ చిత్రానికి పని చేసిన అనుభవాలను శ్రీకాంత్‌దేవా సాక్షితో పంచుకున్నారు.
 
 ప్ర: సంగీతదర్శకుడిగా తిరునాళ్ చిత్రానికి పని చేసిన అనుభవం గురించి?
 జ: తిరునాళ్ చిత్రానికి సంగీతాన్ని అందించాల్సిందిగా చిత్ర దర్శకుడు రమ్‌నాధ్,నిర్మాత సెంథిల్‌కుమార్ వచ్చి అడిగారు. కథ వినగానే ఆహా ఇది నా ప్రతిభకు మంచి పని చెప్పే చిత్రం అనిపించింది. చాలెంజింగ్‌గా తీసుకుని వెంటనే చేద్దాం. జయిద్దాం అని అన్నాను. ఈ చిత్రంలో తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులు ఐదుగురిలో నన్ను ఒకరిగా నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాను.
 
 ప్ర: చిత్రంలో పాటల గురించి కాస్త వివరించగలరా?
 జ: తిరునాళ్ చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. అందులో తందైయుమ్ యారో అనే పాటను ఎవరితో పాడించాలా అని ఆలోచించిగా ఎస్. జానకీ అమ్మ అయితే బాగుంటుందనిపించింది. ఎందరో ప్రఖ్యాత సం గీత దర్శకుల చిత్రాలకు పాడిన జానకీ అమ్మ ఇం దులో పాడి నన్ను అభినందించడం ఆశీర్వాదం గా భావిస్తున్నాను. అదే విధంగా హేయ్ చిన్న చి న్న పంగాలి అనే పాట ను సంగీతదర్శకుడు డి.ఇమాన్ చేత పాడించాం. ఇందులో తిట్టాదే తిట్టాదే అంటూ స్త్రీలను తిట్టకూడదని చెప్పే పా ట చోటు చేసుకుంది. ఈ పాటను నటుడు కరుణాస్ భార్య క్రేస్‌తో పాడించాం. విశేషం ఏమిటంటే వీటిలో నాలుగు పాటల్ని చిత్ర దర్శకుడు పీఎస్.రామ్‌నాథ్‌నే రాశారు.
 
 ప్ర: సంగీతదర్శకుడు గంగైఅమరన్ కూడా ఒక పాట పాడారటగా?
 జ: ఆ పాటను సస్పెన్స్‌గా ఉంచుదామనుకున్నాం. మీరు అడిగారు కనుక చెబుతున్నాను. ఇందులో ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉంది. దాన్ని మా మామతో పాడిద్దామా?అని దర్శకుడిని అడిగాను. మీ మామ ఎవరూ అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. నేను సంగీత దర్శకుడు గంగైఅమరన్‌ను చిన్నతనం నుంచి మామ అనే పిలుస్తాను.అదే విషయాన్ని దర్శకుడికి చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఈ పాట సంగీత ప్రియులకు తీయని అనుభూతిని కలిగిస్తుంది.
 
 ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
 జ: ఇప్పుడు చాలా సెలెక్టెడ్ చిత్రాలే చేస్తున్నాను. ప్రస్తుతం నట్టి హీరోగా నటిస్తున్న బొంగు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాను.
 
 ప్ర: సరే అభిమానులు మీకు మ్యూజిక్ స్టార్ అనే బిరుదునిచ్చారట?
 జ: అదా(చిరునవ్వు) జూలై 20వ తేదీన నా పుట్టిన రోజు. ఆ రోజు అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిమానాన్ని నాతో పం చుకున్నారు. అప్పుడు మ్యూజిక్ స్టార్ అని బిరుదు ఇచ్చారు. ఇదేదో వినడానికి బాగుందే అని నవ్వేశాను. అది వారికి నాపై ఉన్న అభిమానానికి చిహ్నం.

Advertisement
Advertisement