ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం: వాజీద్ ఖాన్ ఇక లేరు

1 Jun, 2020 08:08 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు వాజీద్ ఖాన్(42) ఆదివారం రాత్రి క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న ఆయ‌న ముంబైలోని చెంటూర్ ఆసుప‌త్రిలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌కు కిడ్నీ స‌మ‌స్య‌లు ఉండ‌టంతో కొన్ని నెల‌ల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. కాగా సాజిద్‌- వాజిద్ పేరిట సంగీతాన్ని స‌మ‌కూరుస్తూ వాజీద్ ఖాన్‌ పాపుల‌ర్ అయ్యారు. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో స‌ల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాట‌‌కు సంగీతం అందించారు. (తాప్సీ ఇంట్లో విషాదం..)

ఆయ‌న మృతి ప‌ట్ల బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ‌'వాజీద్ ఖాన్‌ న‌వ్వు త‌న‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద'‌ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 'అత‌ను మ‌న‌ల్ని వ‌దిలి శాశ్వ‌తంగా వెళ్లిపోయాడంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా. ఆయ‌న మ‌ర‌ణం సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోటు' అని‌ సింగ‌ర్ హ‌ర్ష‌దీప్.. వాజీద్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సింగ‌ర్ నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగిన బ‌బుల్ సుప్రియో అత‌ని మ‌ర‌ణ వార్త విని షాక్‌కు లోన‌య్యాన‌న్నారు. మంచి మిత్రుడిని, ప్ర‌తిభావంతుడిని కోల్పోయానంటూ విచారం వ్య‌క్తం చేశారు.(ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)

మరిన్ని వార్తలు