డాక్టర్ చదివినా యాక్టర్‌గా... | Sakshi
Sakshi News home page

డాక్టర్ చదివినా యాక్టర్‌గా...

Published Thu, Apr 16 2015 12:20 AM

డాక్టర్ చదివినా యాక్టర్‌గా...

‘‘చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న మాట కాదనలేక ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకోవడం కోసం ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గర చేరాను. అప్పుడే ‘మల్లెల తీరంలో సిరి మల్లెపువ్వు’ చిత్రానికి అవకాశం వచ్చింది’’ అని క్రాంతి అన్నారు. ఆ తర్వాత ‘ఆ ఐదుగురు’లో నటించిన క్రాంతి, రేపు విడుదల కానున్న ‘వారధి’లో నటించారు.

సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రాంతి మాట్లా డుతూ - ‘‘ఇందులో నాది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. నటుడిగా నాకు సవాల్‌లాంటి పాత్ర కాబట్టే, ఎంచుకొన్నా. హీరో, హీరోయిజమ్ అనే తరహా పాత్రలు మాత్రమే చేయాలనుకోవడంలేదు. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’ చిత్రంలో నటిస్తున్నాననీ, డాక్టర్‌గా చదివినా యాక్టర్‌గా కొనసాగాలన్నది తన ఆశయం అని క్రాంతి తెలిపారు.
 

Advertisement
Advertisement