నా సినిమా నాకు తెలియకుండానే విడుదల: హీరో శ్రీ | Sakshi
Sakshi News home page

నా సినిమా నాకు తెలియకుండానే విడుదల: హీరో శ్రీ

Published Wed, Dec 3 2014 6:07 PM

నా సినిమా నాకు తెలియకుండానే విడుదల: హీరో శ్రీ - Sakshi

తాను నటించిన సినిమాను తనకు తెలియకుండానే విడుదల చేస్తున్నారని 'ఈరోజుల్లో' సినిమా ఫేం శ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. 'నారీ నారీ శ్రీమురారి' అనే సినిమాలో తాను 17 రోజుల పాటు నటించానని, అయితే తనకు చెప్పకుండానే ఆ సినిమాను విడుదల చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో తనకు తెలియకుండా వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారని ఆరోపించారు.

తనకు ఐదు పాటలు ఉన్నట్లు చెప్పి, వేరే హీరోతో రెండు పాటలు షూట్ చేశారన్నారు. అసలు బుధవారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని కూడా నిర్మాతలు తనకు చెప్పలేదని శ్రీ ఆందోళన చెందారు. డిస్ట్రిబ్యూటర్లు గానీ, శాటిలైట్ హక్కులు కొనేవాళ్లు గానీ ఎవరూ ఈ సినిమాను కొనొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement