పవన్, ఆగేలా లేడు..? | Sakshi
Sakshi News home page

పవన్, ఆగేలా లేడు..?

Published Thu, Mar 9 2017 10:23 AM

పవన్, ఆగేలా లేడు..? - Sakshi

ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయల్లో కూడా యాక్టివ్గా ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని భావిస్తున్న పవన్, ఇక నటనకు స్వస్తి పలికాలని భావిస్తున్నాడు. అందుకే ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసే ప్లాన్ ఉన్నాడు పవర్ స్టార్. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

పవన్, ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా మార్చి 24న రిలీజ్కు రెడీ అవుతోంది. కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకె చెప్పాడు పవన్, ఆ తరువాత ఏఎమ్ రత్నం బ్యానర్లో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.

ఈ మూడు సినిమాల తరువాత పవన్ సినిమాలకు దూరమవుతాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ మరో సినిమాకు ఓకె చెప్పాడట. చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయిన తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి పవన్ అంగీకరించాడని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా ఎన్నికల లోపే పూర్తి చేసే ప్లాన్లో ఉన్నాడు పవర్ స్టార్. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement