కొత్త ప్రయాణం మొదలు

20 Jan, 2018 00:42 IST|Sakshi

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కథానాయకుడు నాగచైతన్య. వరుస హిట్లతో జోరు మీదున్నారు దర్శకుడు మారుతి. ఈ ఇద్దరూ జోరుగా కొత్త సినిమా మొదలుపెట్టారు. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని మారుతి పేర్కొన్నారు.

లవ్, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. రమ్యకృష్ణ, ‘వెన్నెల’ కిశోర్, కల్యాణీ నటరాజన్, శరణ్య, పృథ్వీ, రఘుబాబు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిజర్‌ షఫీ, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా