సరదా సరదాగా... | Sakshi
Sakshi News home page

సరదా సరదాగా...

Published Sat, Nov 22 2014 11:26 PM

సరదా సరదాగా... - Sakshi

నాగచైతన్యలో మంచి లవర్‌బోయ్ మాత్రమే కాదు.. మంచి మాస్ హీరో కూడా ఉన్నాడు. ఆ శైలిలోనే భిన్నమైన చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వంలో చైతన్య ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కృతి సనన్ కథానాయిక. బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు మినహా పూర్తయ్యింది. నేడు నాగచైతన్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది స్టయిలిష్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. షూటింగ్ అంతా సరదా సరదాగా జరుగుతోంది. సినిమా కూడా అలానే ఉంటుంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏ మోసం వెనుకైనా ఇద్దరు ఉంటారు. ఒకడు మోసం చేసేవాడు.. మరొకడు మోసపోయేవాడు. నువ్వు రెండోవాడివి కాకుండా ఉండాలంటే మొదటివాడిగా ఉండాలనేది ఈ చిత్రం కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఆర్. సన్నీ, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహనిర్మాత: బాపినీడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement