నచ్చితే పది మందికి చెప్పండి | Sakshi
Sakshi News home page

నచ్చితే పది మందికి చెప్పండి

Published Sun, Aug 26 2018 2:06 AM

Naga Shourya Narthanasala Movie Pre Release Event - Sakshi

‘‘శంకర్‌గారు, ఉషాగారిలాంటి తల్లిదండ్రులు ఉండటం నాగశౌర్య అదృష్టం. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలనుకుంటున్నాను. ‘నర్తనశాల’ అనే టైటిల్‌ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘ఛలో’ వంటి హిట్‌ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్‌ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడు. కష్మిరీ  పరదేశి, యామినీ భాస్కర్‌ హీరోయిన్స్‌.

ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేసి మాట్లాడుతూ – ‘‘ఒక క్లాసిక్‌ సినిమాను తీసుకుని అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా డిజైన్‌ చేసి ఎంటర్‌టైన్‌ చేస్తూ తీసిన సినిమా ఇది. ‘గీత గోవిందం’తో ఎంటర్‌టైన్‌మెంట్‌ వేవ్‌ స్టార్‌ అయింది. అది ‘నర్తనశాల’కు కంటిన్యూ కావాలి’’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు.

అజయ్, శివాజీరాజాగారు, యామినీ, కష్మీరి అందరూ చక్కగా సపోర్ట్‌ చేశారు. సాగర్‌ మహతి మంచి సంగీతం అందించారు.  డైరెక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. మా అమ్మానాన్నలకు చాలా థ్యాంక్స్‌. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్‌ చేసే బుజ్జి అంకుల్, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్‌. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్‌. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది.

సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌’’అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి. ‘‘ఒక మనసు’ చిత్రం కోసం మా బ్యానర్‌లో శౌర్య పనిచేశాడు. హార్డ్‌వర్కర్‌. తనకు మంచి పేరెంట్స్‌ ఉండటంతో.. కెరీర్‌ చక్కగా వెళుతోంది. ఐరా బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు’’ అన్నారు మధుర శ్రీధర్‌ రెడ్డి. ‘‘శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్, ఉషాగారే.. ఈ సినిమాకు మూల స్తంభాలు. సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు నందినీ రెడ్డి.  శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్‌ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు.

Advertisement
Advertisement