రీమేక్‌ కాదు.. కొత్త కథతో...

16 Apr, 2020 05:32 IST|Sakshi

‘‘ఈ దర్శకుడు ఆ నటుడితో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట, ఆ కాంబినేషన్‌ మళ్లీ కలవబోతోందట’’ అనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి నిజమవుతాయి. కొన్నిసార్లు పుకార్లగానే ఉండిపోతాయి. తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి, సమంత కలసి మళ్లీ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘జబర్దస్త్‌’,   ‘ఓ బేబీ’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా ‘ఓ బేబీ’ తెరకెక్కింది. తాజాగా మరో రీమేక్‌ కోసం ఇద్దరూ కలిశారనేది ప్రచారంలో ఉన్న వార్త సారాంశం. ఈ వార్తలకు స్పందిస్తూ ట్వీట్‌ చేశారు నందినీ రెడ్డి. ‘‘నా తదుపరి చిత్రం రీమేక్‌ కాదు. కొత్త కథతో స్వప్నా సినిమాస్‌ బ్యానర్‌లో చేయబోతున్నాను. ఒకవేళ నేను, సమంత కలసి సినిమా చేయాలనుకుంటే చాలా సంతోషంగా, గర్వంగా ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు నందినీ రెడ్డి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు