తెలుగులో యశ్‌రాజ్ వారి ఆహా! కల్యాణం | Sakshi
Sakshi News home page

తెలుగులో యశ్‌రాజ్ వారి ఆహా! కల్యాణం

Published Mon, Jan 20 2014 12:22 AM

తెలుగులో యశ్‌రాజ్ వారి ఆహా! కల్యాణం

 బాలీవుడ్‌లో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ తొలిసారిగా దక్షిణాదిలో అడుగుపెట్టబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో నాని హీరోగా ‘ఆహా! కల్యాణం’ నిర్మిస్తోంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బ్యాండ్ బాజా బారాత్’కి ఇది రీమేక్. ఇందులో వాణీకపూర్ కథానాయిక. సిమ్రాన్ ముఖ్యపాత్ర పోషించారు. గోకుల్‌కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న పాటలను విడుదల చేయబోతున్నారు. ధరణ్‌కుమార్ స్వరాలందించారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడు దల చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: లోకనాథన్ శ్రీనివాసన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి.
 

Advertisement
Advertisement