ఆగస్టు 26న మజ్ను ఆడియో

23 Aug, 2016 15:04 IST|Sakshi
ఆగస్టు 26న మజ్ను ఆడియో

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని, హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ను కన్ఫామ్ చేశాడు హీరో నాని.

మంగళవారం ఉదయం సినిమాలోని కళ్లు మూసి తెరిచే లోపే పాటను రిలీజ్ చేసిన నాని, ఆగస్టు 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి