నయన్.. యువన్.. హత్యాకాలమ్! | Sakshi
Sakshi News home page

నయన్.. యువన్.. హత్యాకాలమ్!

Published Fri, Nov 18 2016 11:11 PM

నయన్.. యువన్.. హత్యాకాలమ్!

నిన్న శుక్రవారం తమిళ చిత్రసీమకు నయనతార హీరో అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఆమె కొత్త సినిమాల స్టిల్స్ అండ్ న్యూసే. సాధారణంగా హీరోల బర్త్‌డేలకు వాళ్లు నటిస్తోన్న కొత్త సినిమాల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం, టైటిల్ అనౌన్స్‌మెంట్స్ చేయడం కామన్. నిన్న నయనతార బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులకు రెండు చిత్ర బృందాలు గిఫ్ట్‌లు ఇచ్చాయి. మింజూర్ గోపీ దర్శకత్వంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తోన్న తమిళ సినిమా ‘అరమ్’లో ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ కూడా నిన్నే ప్రకటించారు. దీంతో పాటు నయన్ ముఖ్యతారగా నటించనున్న మరో తమిళ సినిమాకు ‘కొలైవుదిర్ కాలమ్’ అనే టైటిల్‌ను ప్రకటించి, నిన్నే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం.

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ‘కొలైవుదిర్ కాలమ్’తో ఇళయరాజా కుమారుడు, యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారుతున్నారు. హిందీ నిర్మాత వశూ భగ్నానీ పూజా ఫిల్మ్స్‌తో కలసి వైఎస్సార్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఈనాడు’, ‘బిల్లా-2’ చిత్రాల ఫేమ్ చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘కొలైవుదిర్ కాలమ్’ అంటే తెలుగులో ‘హత్యలు చేసే కాలం’ అని అర్థం. ఈ హత్యాకాలమ్‌లో ఎవరు ఎవర్ని హత్య చేశారో! ఫస్ట్ లుక్ చూస్తుంటే నిజం చెప్పకుండా ఎవరో నయనతార నోరు మూసేసినట్టు ఉంది కదూ!!

Advertisement
Advertisement