తేరే బినా పాటకు నెటిజన్లు ఫిదా..

13 May, 2020 14:37 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ భాయిజాన్ సల్మాన్‌ ఖాన్, హీరోయిన్‌ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌లా కొత్త‌ రొమాంటిక్‌ ట్రాక్‌ ‘తేరే బినా’ వీడియో సాంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పాటలో వారిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా ఈ పాటను మంగళవారం భాయిజాన్‌ తన యూట్యూబ్ ఛానల్‌‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.  మరో విషయం ఏంటంటే ఈ పాటను స్వయంగా సల్మాన్‌ చిత్రీకరించాడు. అంతేకాదు పాటను కూడా తనే పాడాడు. ఇక పాటలో గడ్డంతో ఉన్న భాయిజాన్‌ను చూసి‌  నెటిజన్లు ‘‘సల్మాన్ గడ్డంతో‌ మరింత హ్యండ్ ‌సమ్‌గా ఉన్నాడు’ అని ‘జాక్వలిన్‌‌ మేక‌ప్‌, క్యాస్టుమ్స్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. (సల్మాన్ ‘తేరే బినా’ టీజర్‌ విడుదల)

సల్మాన్‌ ఈ పాటను తన యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేస్తూ.. ‘లాక్‌డౌన్‌లో మీకు ఇంకాస్తా వినోదాన్ని అందించేందుకు మా కొత్త ట్రాక్‌ ‘తేరె బినా’ వచ్చేసింది. ఈ న్యూ రొమాంటిక్‌ ట్రాక్‌ వినండి’ అంటూ షేర్‌ చేశారు. అంతేగాక ‘‘నేను పాడిన ఈ పాటకు నేనే దర్శకుడిని, నిర్మాతను. అంతేగాక చిత్రీకరణ కూడా నేనే చేశాను. ఇప్పుడు మీ కోసం పోస్టు కూడా చేస్తున్నా. ఈ పాట వినండి, పాడండి. మళ్లీ ఇంట్లో చిత్రీకరించి రీపోస్టు చేయండి, షేర్‌ చేయండి.. ట్యాగ్‌ చేయండి.. #TereBina’’ అంటూ తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కాగా ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పన్వెల్‌లోని సల్మాన్‌ ఫాం హౌజ్‌లో‌ జరిగింది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను జాక్వలిన్‌ దగ్గరుండి చూసుకున్నట్లు ఆమె ఈ పాట ప్రమోషన్‌ ఇంటర్య్వూలో వెల్లడిచింది. (తేరే బినా మ్యూజిక్ వీడియో రిలీజ్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా