ఫస్ట్‌ ఇది చరిత్ర అని అనుకోవడం లేదు: హీరో

21 Jan, 2020 16:17 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తాజా చిత్రం ‘తాన్హాజీ’. ప్రస్తుతం విడుదలైన ఈసినిమా బీ-టౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్‌లను రాబడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ‘తాన్హాజీ’లో ప్రతినాయడిగా నటించి మెప్పించిన ఈ పటౌడి హీరో తాజాగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాడు. అయితే సినిమా సక్సెస్‌పై కాకుండా ‘కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఇండియా’లో తను చేసిన వివాస్పద వ్యాఖ్యల వల్ల నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనుపమ చోప్రాకు సైఫ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సైఫ్‌ను ‘తాన్హాజీలోని  ప్రశ్నార్థక రాజకీయాలు మిమ్మల్ని బాధపెట్టాయా?’ అని అనుపమ ప్రశ్నించగా.. ‘ఫస్ట్‌.. నేను ఇది చరిత్ర అని అనుకోవడం లేదు, బ్రిటీష్ వారు అది తిరిగి ఇచ్చేవరకు ఈ సినిమాలో భారతదేశ ఉనికి ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో జాతీయతపై సైఫ్‌ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సైఫ్‌ చేసిన వ్యాఖ్యలకు ఓ ట్విటర్‌ యూజర్‌ భారతదేశ పురాతన పటాన్ని షేర్‌ చేస్తూ ‘చరిత్రను ప్రశ్నించే ముందు మొదటగా ఇది చదవండి మిస్టర్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. అదేవిధంగా ‘డియర్‌ సైఫ్‌ అలీ ఖాన్‌.. బ్రిటిష్‌ వారు భారతదేశానికి రావడానికి పూర్వం.. చాలా ఏళ్ల కిందట గీసీన ఈ భారతదేశ చిత్ర పటాన్ని చూడండి!’ అని మరోక ట్వటర్‌ యూజర్‌ కామెంట్‌ చేశాడు. 

ఇక తాన్హాజీలో సైఫ్‌ అలీఖాన్‌ 1670లో సింహాగడ్‌ యుద్ధంలో ఛత్రపతి శివాజీ మరాఠా దళాలు చేసిన దాడిలో ఓడిపోయి కోంధన కోటను కొల్పోయిన రాజ్‌పుత్‌ జనరల్‌ ఉదయ్‌భన్‌ రాజు పాత్రలో కనిపించాడు. కాగా అజయ్‌ దేవగన్‌ తానాజీ మలుసారే పాత్రలో నటించగా ఆయన భార్య సావిత్రిబాయి మలుసారేగా నటించారు. అంతేగాక చివరిగా తాన్హాజీలో కనిపించిన సైఫ్‌ తర్వాత హంటర్‌, భూట్‌ పోలీసు, జవానీ జానెమాన్‌ పైప్లైన్లో వంటి సినిమాలలో కూడ నటిస్తూ బీజీగా ఉన్నాడు.

మరిన్ని వార్తలు