కరోనా.. భయం లేదు | Sakshi
Sakshi News home page

కరోనా.. భయం లేదు

Published Fri, Mar 20 2020 6:18 AM

new film name registered on coronavirus - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడగా మరికొందరు చికిత్స చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా పేరెత్తితే చాలు భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ప్రపంచ జనాభాని ఇంతగా భయపెడుతున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా తీస్తే మంచి ఆదరణ ఉంటుందని, వసూళ్లు కూడా బాగా ఉంటాయని భావించిన కొందరు దర్శకులు, నిర్మాతలు టైటిల్స్‌ కూడా రిజిస్టర్‌ చేయిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా తీస్తానంటూ ఇప్పటికే కన్నడ దర్శకుడు ఉమేశ్‌ భన్‌కర్‌ ప్రకటించారు. అంతేకాదు.. ‘డెడ్లీ కరోనా’ (భయంకరమైన కరోనా) అనే టైటిల్‌ని కూడా నమోదు చేయించారాయన. తాజాగా తమిళ్‌లో ‘కరోనా భయమ్‌ ఇల్లై’’ (కరోనా భయం లేదు) అనే టైటిల్‌ని ఓ నిర్మాత రిజిస్టర్‌ చేయించడం విశేషం. మరి.. కరోనా పేరుతో  ఇంకా ఎన్ని టైటిల్స్‌ నమోదు అవుతాయో చూడాలి.

Advertisement
Advertisement