నిఖిల్ నిర్ణయం ఫలిస్తుందా..? | Sakshi
Sakshi News home page

నిఖిల్ నిర్ణయం ఫలిస్తుందా..?

Published Fri, Apr 14 2017 1:41 PM

నిఖిల్ నిర్ణయం ఫలిస్తుందా..?

పెద్ద నోట్ల రద్దు తరువాత ముందుగా రిలీజ్ అయిన సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డ సమయంలో.., నిఖిల్ తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సూపర్ హిట్ కొట్టాడు. నిఖిల్ ఇచ్చిన ధైర్యంతోనే తరువాత వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఎక్కడికీ పోతావు చిన్నవాడా సమయంలో రిస్క్ చేసి సక్సెస్ అయిన నిఖిల్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంటున్నాడు.

స్వామి రారా సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నిఖిల్. కేశవ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే నెల రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి 2 రిలీజ్ అయిన తరువాత రెండు వారాల గ్యాప్ కూడా లేకుండా మే 12న కేశవ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఒక వేళ బాహుబలి 2కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో మరో వారం ఆలస్యంగా మే 19న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

మే 19న వచ్చినా కేశవకు పోటీ తప్పుదు. సోగ్గాడు చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే రోజు కేశవ రిలీజ్ అయితే పోటి రసవత్తరంగా మారుతుంది. నిఖిల్ కేశవ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను నాగార్జున దగ్గరుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. మరి రెండు సినిమాలు తలపడితే విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement