చాలా విచిత్రమైన పరిస్థితి నాది

11 Jul, 2013 03:24 IST|Sakshi
చాలా విచిత్రమైన పరిస్థితి నాది

తాప్సీ ఇప్పుడు ఫుల్ బిజీ. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ విజయాన్ని కూడా ఆస్వాదించలేనంత బిజీ అన్నమాట. హిందీలో ఆమె నటించిన తొలి చిత్రం ‘చష్మే బద్దూర్’ ఇటీవలే విడుదలయ్యింది. హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.

బాలీవుడ్‌వారి అభినందనలను అందుకుంటూ సినిమా విజయవంతంగా సాగుతోంది. కానీ, ఆ అభినందనలను వినే తీరిక కూడా తాప్సీకి లేదు. ఎందుకంటే షూటింగ్స్‌తో బిజీ. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఈ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చేసే పని తాలూకు విజయాన్ని ఆస్వాదించలేనంత బిజీగా ఉండటం ఆనందంగానే ఉంటుంది.

కానీ నలుగురూ మెచ్చుకున్నప్పుడు స్వయంగా వినాలని ఉంటుంది కదా’’ అన్నారు. బాలీవుడ్‌లో తొలి అడుగు విజయవంతమైంది. మరి... మలి అడుగు ఖరారయ్యిందా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే -‘‘హిందీలో మరో సినిమాకి సైన్ చేశాను. ఈ ఏడాది చివర్లో అది ప్రారంభమవుతుంది. నాలానే హిందీ పరిశ్రమకు కొతై్తన ఓ యువ హీరోతో ఈ సినిమా చేయబోతున్నా. ఈ అడుగు కూడా మంచిదే అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి