ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్

5 Apr, 2017 10:17 IST|Sakshi
ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ విషయంలో సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ ఫస్ట్ లుక్లో కేవలం టైటిల్ లోగోను మాత్రమే రివీల్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి