'హాట్' టాపిక్‌: ఫ్రెంచ్‌ కిస్‌తో ఫస్ట్ పోస్టర్‌! | Sakshi
Sakshi News home page

'హాట్' టాపిక్‌: ఫ్రెంచ్‌ కిస్‌తో ఫస్ట్ పోస్టర్‌!

Published Mon, May 9 2016 4:13 PM

'హాట్' టాపిక్‌: ఫ్రెంచ్‌ కిస్‌తో ఫస్ట్ పోస్టర్‌!

ఈఫీల్ టవర్‌ ఎదురుగా.. హీరో-హీరోయిన్ల మధ్య  ఘాటైన 'ఫ్రెంచ్‌ కిస్‌'తో తొలి పోస్టర్‌ను విడుదల చేసింది 'బెఫికర్‌' టీమ్‌. 'బాజీరావు మస్తానీ' హీరో రణ్‌వీర్‌ సింగ్‌, వాణీకపూర్‌ లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమా తొలిచిత్రాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేశారు.

ఈ ఫస్ట్ పోస్టర్‌లో పెదవులతో పెదవులు పెనవేసుకొని.. తమకంగా 'ఫెంచ్‌ కిస్‌' పెట్టుకుంటున్న రణ్‌వీర్, వాణీ కపూర్‌ జోడీ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈఫీల్ టవర్‌కు దూరంగా ఓ ఎత్తైన బిల్డింగ్‌ మీద కూర్చొని వీరు ముద్దుపెట్టుకుంటూ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రొమాంటిక్‌ లవ్ స్టోరీ అని ఫస్ట్ పోస్టర్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత ఎత్తులో తీసిన 'ఫ్రెంచ్ కిస్' షాట్‌ అద్భుతమంటూ హీరోయిన్‌ వాణీకపూర్‌  ఈ ఫస్ట్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement