యాంకర్‌కు ఆస్కారం లేదు | Sakshi
Sakshi News home page

యాంకర్‌కు ఆస్కారం లేదు

Published Thu, Feb 7 2019 4:50 AM

Oscars 2019 ceremony to go without host after Kevin Hart row - Sakshi

‘అండ్‌ ది అవార్డ్‌ ఫర్‌ ది బెస్ట్‌ మూవీ గోస్‌ టూ..’ అంటూ ప్రతీ అవార్డ్‌ ఫంక్షన్‌ను రక్తి కట్టించేది యాంకరే. అయితే అన్ని అవార్డ్స్‌లో కల్ల ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్‌కు ఈ ఏడాది యాంకర్‌ (హోస్ట్‌) ఉండకపోవడం విశేషం. ఈ విషయం అధికారికంగా ఆస్కార్‌ బృందం నుంచే వచ్చింది. ఇలా యాంకర్‌ లేకుండా అవార్డ్స్‌ ఫంక్షన్‌ జరగడం గడిచిన 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.

అవార్డ్స్‌ను ప్రదానం చేయడానికి స్టేజ్‌ మీదకు వచ్చే సెలబ్రిటీలు తదుపరి అవార్డులను ప్రకటిస్తారు. నిజానికి ఈ ఏడాది హోస్ట్‌గా కెవిన్‌ హార్ట్‌ షోను నిర్వహించాలి. కానీ గతంలో కెవిన్‌ చేసిన ట్వీట్స్‌ వివాదం కావడంతో స్వయంగా ఈ పోస్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Advertisement

తప్పక చదవండి

Advertisement