ప్రజలంటే భయం ఉండాలి | Sakshi
Sakshi News home page

ప్రజలంటే భయం ఉండాలి

Published Sun, May 6 2018 12:23 AM

People’s Star’s Annadatha Sukhibhava clears censor hurdles - Sakshi

‘‘నా ‘అన్నదాత సుఖీభవ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది’’ అన్నారు దర్శక– నిర్మాత, నటుడు ఆర్‌. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెన్సార్‌ రివైజింగ్‌ కమిటీ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది.  అన్నదాత సుఖీభవలా లేదు.. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఈ చిత్రానికి రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేసి జూన్‌ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement