రిలాక్స్‌డ్‌గా ఉన్నా.. | Sakshi
Sakshi News home page

రిలాక్స్‌డ్‌గా ఉన్నా..

Published Mon, Apr 11 2016 2:25 AM

రిలాక్స్‌డ్‌గా ఉన్నా.. - Sakshi

- సమంత
విజయ్ హీరోగా నటించిన  తమిళ చిత్రం ‘తెరి’ తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్ . అదే చిత్రం తెలుగులో ‘పోలీసోడు’గా రానుంది. సమంత, అమీ జాక్సన్ కథానాయికలు. ‘రాజా- రాణి’ ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, కలైపులి ఎస్. థాను ఈ నెల 14న విడుదల కానుంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘‘ ‘రాజా-రాణి’ కథను తెలుగులో తీయాలనుకున్నా. కానీ కుదరలేదు.  తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ‘పోలీసోడు’లో ఉన్నాయి’’ అని చెప్పారు. కథానాయిక సమంత మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటివరకూ పాతిక సినిమాలు చేశాను.

అన్నిటికీ ఏదో రకంగా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమా విడుదల కోసం చాలా రిలాక్స్‌డ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఈ ‘పోలీసోడు’ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా.  తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేశాకే తెలుగులో సినిమా చేస్తానని గతంలో చెప్పాను. ఇప్పుడిక నా తదుపరి చిత్రం తెలుగులోనే ఉంటుంది’’ అని దర్శకుడు అట్లీ అన్నారు.

Advertisement
Advertisement