రేస్‌లో గెలుపు! | Sakshi
Sakshi News home page

రేస్‌లో గెలుపు!

Published Fri, Oct 13 2017 12:09 AM

Pooja Hegde THIRD Actress In Salman's Race 3  - Sakshi

1, 2, 3... రెడీ స్టార్ట్‌ గో అనగానే... పరుగు పందెంలో నంబర్‌ వన్‌ రావడం కోసం పరుగుపెడతాం. గెలిస్తే ఆనందపడతాం. సినిమా కూడా అంతే. ఏ సినిమాలో ఎవరికి ఛాన్స్‌ వస్తుంది? రేస్‌లో ఎవరు విన్‌ అవుతారు? అనే ఎగై్జట్‌మెంట్‌ ఉంటుంది. ఈ మధ్య బాలీవుడ్‌లో ఇలాంటి ఓ రేస్‌లో పూజా హెగ్డే విన్‌ అయ్యారని టాక్‌. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘రేస్‌ 3’లో పలువురి హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికి ఆ అవకాశం పూజ కొట్టేశారట. ‘రేస్‌’ సిరీస్‌కి ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పూజా నటిస్తున్నారని కొందరు, లేదని కొందరు అంటున్నారు. పూజా నటిస్తున్నారన్న వార్తే నిజం. వాస్తవానికి హృతిక్‌ రోషన్‌ సరసన పూజా నటించిన ‘మొహెంజొదారో’ ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో ఇక, పూజకి హిందీ లో అవకాశాలు రావని కొందరు  ఫిక్సయ్యారు. కానీ, ‘రేస్‌ 3’లో అవకాశం కొట్టేశారామె. తెలుగులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన ఓ సినిమా, రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement